ఫోటో మొమెంట్ : డైరెక్టర్ వెంకట్ ప్రభు తో సూర్య

Published on Sep 6, 2023 12:05 am IST

కోలీవుడ్ దర్శకుల్లో ఒకరైన వెంకట్ ప్రభు ఇటీవల యువ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య తో యాక్షన్ మూవీ కస్టడీ తెరకెక్కించారు. ఇక దాని అనంతరం అతి త్వరలో ఇళయదళపతి విజయ్ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తీయనున్నారు. ప్రస్తుతం ఆ పనుల్లో నిమగ్నం అయి ఉన్న వెంకట్ ప్రభు తాజాగా స్టార్ యాక్టర్ సూర్య ని ఓ ఎయిర్ పోర్ట్ లో కలిసి ఆయనతో కలిసి దిగిన ఒక సెల్ఫీ పిక్ ని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసారు.

చాలా రోజుల తరువాత నాకు ఇష్టమైన నటుడు సూర్య గారిని ఎయిర్ పోర్ట్ లో కలవడం ఎంతో ఆనందంగా ఉందని తన పోస్ట్ లో తెలిపారు వెంకట్ ప్రభు. మరోవైపు శివ దర్శకత్వంలో భారీ మూవీ కంగువ చేస్తున్నారు సూర్య. ఈ మూవీ పై అన్ని భాషల ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా వీరిద్దరి క్రేజీ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :