బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న వెంకీ మామ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ఆదర్శ కుటుంబం” అంటూ అనౌన్స్ చేసిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ వేసవిలోనే రిలీజ్ ప్రకటించిన మేకర్స్ ప్రస్తుతం షూట్ లోనే బిజీగా ఉన్నారు.
ఇక లేటెస్ట్ గా ఓ ఆన్ లొకేషన్ పిక్ తో సినిమాపై అప్డేట్ అందించారు. సినిమా సెట్స్ లో వెంకీ మామ అలాగే త్రివిక్రమ్ కలిసి మాట్లాడుకుంటున్న పిక్ ని మేకర్స్ షేర్ చేశారు. సినిమా సగానికి చేరుకున్నట్టుగా ఇందులో హింట్ ఇస్తున్నారు. మరి ఈ స్పెషల్ కాంబినేషన్ నుంచి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
𝗧𝘄𝗼 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗺𝗼𝘀𝘁 𝗹𝗼𝘃𝗲𝗱 ❤️
In the middle of building something special… ✨ #AadarshaKutumbam shoot in progress 🫶🏻#AK47 | #Venky77 | #VenkateshXTrivikram
Victory @VenkyMama #Trivikram @SrinidhiShetty7 #SRadhaKrishna @haarikahassine pic.twitter.com/EfLXmef1Nk
— Haarika & Hassine Creations (@haarikahassine) April 17, 2026
