ఫోటో మూమెంట్ : యంగ్ మెగా జెనరేషన్ అంతా ఒకే ఫ్రేమ్ లో.!

Published on Dec 26, 2021 8:00 am IST

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా కూడా తమ హీరోల సినిమాలకు సంబంధించి అప్డేట్స్ థియేట్రికల్ రిలీజ్ లతో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారిని మరింత ఖుషీ చేసేందుకు అన్నట్టుగా ఓ ఫోటో ఇప్పుడు బయటకొచ్చి వైరల్ అవుతుంది. నిన్న క్రిస్మస్ సందర్భంగా టాలీవుడ్ సినీ తారలు అంతా కూడా తమ అభిమానులకు విషెష్ తెలియజేసారు. అలానే మెగా హీరోలు కూడా తెలియజేసారు.

మరి ఈ మెగా కుటుంబంలోని యంగ్ జెనరేషన్ అంతా ఒక దగ్గర గాథర్ ఈ క్రిస్మస్ వేడుకలు సెలెబ్రేట్ చేసుకున్నారు. మరి ఈ వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ నుంచి వైష్ణవ్, నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహ నిహారిక భర్త, వారి సోదరిలు ఇలా అంతా కలిపి యంగ్ జెనరేషన్ అంతా సింగిల్ ఫొటోలో కనిపించారు. ఇది చూడటానికి ఎంతో ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. దీనితో ఈ పిక్ అయితే ఇపుడు మెగా ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :