ఫోటో మూమెంట్: పవన్ తో “యుగానికి ఒక్కడు” నటుడు.. కలయిక ఆంతర్యం

ఫోటో మూమెంట్: పవన్ తో “యుగానికి ఒక్కడు” నటుడు.. కలయిక ఆంతర్యం

Published on Oct 27, 2024 8:27 PM IST


ప్రస్తుతం హీరోగా అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఇపుడు నటిస్తున్న భారీ సినిమాలు “హరిహర వీరమల్లు”, “ఓజి” లు సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఈ సినిమాలు షూటింగ్స్ చేస్తూనే పవన్ పొలిటికల్ గా కూడా చురుగ్గా దూసుకెళ్తున్నారు.

అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని కోలీవుడ్ ప్రముఖ నటుడు పార్తిబన్ కలవడం జరిగింది.. మరి తెలుగు ఆడియెన్స్ కి అయితే “యుగానికి ఒక్కడు” సినిమాలో చోళ రాజుగా బాగా తెలిసిన ఈ నటుడు పవన్ ని కలవడం ఆసక్తిగా మారింది. ఈ ఇద్దరి కలయికలో ముందు సినిమాలు కూడా ఉన్నాయా అంటే అది కూడా లేదు.

అయినప్పటికీ ఇపుడు వీరి కలిసిన పిక్స్ వైరల్ గా మారాయి. అలాగే పవన్ తో కలిసి పార్తిబన్ తీసుకున్న సెల్ఫీ మంచి ఫోటో మూమెంట్ గా మారింది. ఇందులో ఇద్దరూ చిర్నవ్వుతో కనిపిస్తున్నారు. అయితే పార్తిబన్ రాసిన ఓ పుస్తక ఆవిష్కరణ పవన్ తో చేయించినట్టు తెలుస్తుంది. దీనితో వీరి ఫోటోలు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు