ఫోటో మూమెంట్ : ఇళయరాజాతో బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన యువన్ శంకర్

రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినికాంత్ (Rajinikanth) హీరోగా చేస్తున్న “కూలీ” (Coolie) సినిమా విషయంలో లెజెండరీ సంగీత దర్శకులు ఇళయరాజా ఓ కేసు వేసినట్టుగా వచ్చిన వార్తలతో రాజా గారి పేరు మరోసారి సినీ వర్గాల్లో వినిపించడం మొదలైంది. అయితే ఆ జెనరేషన్ లో ఎన్నో అద్భుతమైన ట్యూన్స్ ని అందించిన ఇళయరాజా ఇప్పుడు కూడ పలు చిత్రాలు చేస్తున్నారు.

ఇక తన వారసుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర స్టార్ సంగీత దర్శకుడు అయినటువంటి యువన్ శంకర్ రాజా కూడా తెలుగు సహా తమిళ్ లో అనేక చిత్రాలు చేస్తుండగా రీసెంట్ గా తన కంపొజిషన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari), గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (Greatest Of All Time) సినిమాలు నుంచి పాటలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా యువన్ ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేయడం వైరల్ గా మారింది.

తన తండ్రికి ఆప్యాయంగా ఆహరం తినిపిస్తున్న ఫోటోని తన సోషల్ మీడియా ద్వారా యువన్ పంచుకున్నాడు. దీనితో ఈ అందమైన స్నాప్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇద్దరూ కలిసి చాలా తక్కువ ఫొటోల్లోని కనిపిస్తూ ఉంటారు, దీనితో ఈరోజు వచ్చిన పిక్ మరింత స్పెషల్ గా మారింది.

Exit mobile version