పునీత్ చివరి ఫోటో షూట్ వీడియోను షేర్ చేసిన ఫోటోగ్రాఫర్ చందన్ గౌడ

Published on Oct 31, 2021 9:02 pm IST

శాండల్ వుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి సినీ, రాజకీయ రంగాలకి చెందిన ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు కన్నీటి వీడ్కోలు పలికారు. బెంగుళూరు లోని శ్రీ కంఠీరవ స్టూడియో లో ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది.

అయితే ప్రముఖ ఫోటోగ్రాఫర్ చందన్ గౌడ సోషల్ మీడియా వేదిక గా ఒక వీడియో ను షేర్ చేయడం జరిగింది. జేమ్స్ చిత్రం కోసం పునీత్ ఫోటో షూట్ వీడియో ను షేర్ చేశారు. ఈ వీడియో లో పునీత్ ఎప్పటిలాగానే చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస విడిచే మూడు రోజుల ముందు ఈ ఫోటో షూట్ జరిగింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ నిర్మాణం లో వుండగానే, ద్విత ను ప్రకటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :