పిక్ ఆఫ్ డికేడ్: మోడీతో చిరు, పవన్ ల పవర్ఫుల్ విజువల్ వైరల్

పిక్ ఆఫ్ డికేడ్: మోడీతో చిరు, పవన్ ల పవర్ఫుల్ విజువల్ వైరల్

Published on Jun 12, 2024 1:59 PM IST


టాలీవుడ్ మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ బిగ్ డే ఇప్పుడు రానే వచ్చింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శబ్దంతో అభిమానుల్లో ఓ రేంజ్ లో ఉత్సాహం నెలకొంది. అయితే ఏ మహా ఈవెంట్ లో దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రధాన అతిధిగా విచ్చేయగా ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు కూడా వచ్చారు.

మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ లు విచ్చేయగా ఆ విజువల్స్ చూసేందుకు అభిమానులకి అయితే రెండు కళ్ళు సరిపోలేదు. ఇక ఇదిలా ఉండగా సభ ముగిసే సమయంలో పవన్ కళ్యాణ్ మోడీతో ప్రత్యేకంగా మాట్లాడడం ఆసక్తిగా మారింది.

అయితే ఇది తన అన్నయ్య కోసమే అని తేరుకునే లోపే వెనక్కి వెళుతున్న పవన్ చెయ్యి పట్టుకొని అన్నయ్య చిరంజీవి దగ్గరకి స్వయంగా మోడీ తీసుకెళ్లి ఇద్దరి చేతులు పైకెత్తి అభిమానులకి టన్నుల కొద్దీ హైప్ ని అందించారు. ఈ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్ లపై ఎమోషనల్ విజువల్స్ మరింత కదిలించాయి.

దీనితో ఈ సెన్సేషనల్ విజువల్ తాలూకా పిక్ నేటికి పిక్ ఆఫ్ డికేడ్ గా మారింది. మరి గడిచిన పదేళ్లలో కానీ ఇలాంటి ఒక మూమెంట్ ని మెగా అభిమానులు చూసింది లేదని చెప్పాలి. మొత్తానికి అయితే హ్యాపీ మూమెంట్ తో అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు