పిక్ టాక్ – ఎవర్ ఛార్మింగ్ మహేష్.. క్లిక్ బై సితార..!

Published on Jul 22, 2022 4:30 pm IST

ఈ ఏడాది మన టాలీవుడ్ దగ్గర భారీ హిట్స్ అయినటువంటి చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” కూడా ఒకటి. మరి ఈ సినిమా భారీ సక్సెస్ అనంతరం మహేష్ ఆల్రెడీ ఓ వెకేషన్ ముగించుకొని మళ్ళీ చిన్న వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ ఖాళీ విలువైన సమయాన్ని మహేష్ అయితే ఫ్యామిలీ తోనే ఎంతో ఆనందంగా గడుపుతుండగా మహేష్ అయితే ఇప్పుడు ఒక ఫోటోని షేర్ చేసుకున్నారు.

గెట్ అవే టైం అంటూ ఒక సింపుల్ లుక్ లో ఆనందంగా గడుపుతున్న ఫోటో ఇది. మరి ఇందులో మహేష్ ఎవర్ ఛార్మింగ్ గా కనిపిస్తూ అభిమానులని మరింత ఖుషి చేసేలా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ బ్యూటిఫుల్ ఫోటోని మహేష్ కూతురు సితార ఘట్టమనేని క్లిక్ మనిపించింది అని మహేష్ తెలిపి ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు. మరి ఈ వెకేషన్ తర్వాత అయితే మహేష్ అవైటెడ్ కాంబో త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :