సెప్టెంబర్ 2న పిల్లా నువ్వులేని జీవితం’ టీజర్?

Pilla-Nuvvu-Leni-Jeevitham
సాయి ధరమ్ తేజ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఫస్ట్ లుక్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం నాడు విడుదల చేశారు. ఆ పోస్టర్ కు సినిమా ప్రియులనుండి మంచి స్పందన సైతం లభించింది

ఇప్పుడు ఈ సినిమా టీజర్ ని పవన్ కళ్యాణ్ జన్మదినమైన సెప్టెంబర్ 2న విడుదల చేద్దామని భావిస్తున్నారు. గీతా ఆర్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాకు నిర్మాణ సంస్థలు. రెజినా హీరోయిన్. బన్నీ వాస్, హర్షిత నిర్మాతలు

సెప్టెంబర్ లో ఆడియోని, అక్టోబర్ లో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయి మొదటి సినిమా ‘రేయ్’ ఆలస్యం అవుతున్న కారణాన దానికంటే ముందే ఈ సినిమా విడుదలకానుంది

Exit mobile version