రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ చిత్రం నిన్న జనవరి 9న భారీ ఎత్తున విడుదలైంది. మురుగదాస్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. ఇంతవరకు బాగానే ఉండగా సినిమాను పైరసీ భూతం పట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సినిమా విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ప్రముఖ పైరసీ వెబ్ సైట్లో సినిమా దర్శనమిచ్చింది.
చిత్రాన్ని వీక్షించడమే కాదు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వీలు కూడా అందించింది ఆ పైరసీ సైట్. ఇప్పటికే వేల సంఖ్యలో డౌన్ లోడ్స్ జరిగిపోయాయి. సోషల్ మీడియాలో సినిమా క్లిప్పింగ్స్ వచ్చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు అభిమానులు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా చిత్రాన్ని పైరసీ సైట్ల నుండి తొలగించాలని సైబర్ పోలీసుల్ని కోరుతున్నారు.
