పవన్ పాట కోసం ఎదురుచూపుల్లో అభిమానులు

పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని రెండవ పాట ‘గాలి వాలుగా’ ఈరోజే విడుదలకానుంది. రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర్నుండి అభిమానులంతా ఈ పాట కోసమే ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ చెప్పారు కానీ సమయం చెప్పకపోవడంతో సాంగ్ ఎప్పుడెప్పుడు బయటికొస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

పైగా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక వీడియో సాంగ్ ను రూపొందించడం కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచేసింది. మరి మేకర్స్ విడుదల టైంను చెప్తారో లేకపోతే పాటను నేరుగా వదిలేస్తారో చూడాలి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో విజయంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.