పవన్ ఫస్ట్ లుక్ కోసం అభిమానుల ఎదురుచూపులు !


సాధారణంగా పవన్ సినిమాలంటేనే అభిమానుల్లో భీభత్సమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అంటే ఆ క్రేజ్ కు ఆకాశమే హద్దు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా పరిస్థితి కూడా ఇదే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే గాక సినీ జనాలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ రెగ్యులర్ లుక్ లో కాకుండా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనుండటంతో ఆయన లుక్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు తెగ ఆరాటపడిపోతున్నారు.

కానీ సినిమా మొదలై చాన్నాళ్లు కావొస్తున్నా ఫస్ట్ లుక్ సంగతి ఇంకా ఖాయం కాలేదు. కానీసం టైటిల్ ఏమిటనేది కూడా ఇంకా తెలియలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందో చెప్పాలని నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ ను కోరుతున్నారు. మరి వారి విన్నపాన్ని ఆలకించి దర్శక నిర్మాతలు ఫస్ట్ లుక్, టైటిల్ పై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. పవన్ చేస్తున్న ఈ 25వ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.