యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన “ప్లాన్ బి” ట్రైలర్..!

Published on Sep 15, 2021 3:16 pm IST


శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా కెవి రాజమహి దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ వండర్‌గా తెరకెక్కించిన చిత్రం “ప్లాన్ బి”. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఏవీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డింపుల్ హీరోయిన్. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

అయితే ప్రస్తుతం ఈ చిత్రం ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరిని థ్రిల్ కి గురిచేయడం ఖాయమని దర్శక నిర్మాతలు అంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల కాగా, ఆయన కూడా ఈ సినిమాపై మంచి నమ్మకం పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :