ప్రభాస్ పై ప్లాన్డ్ నెగిటివ్ ప్రచారం?

Published on Mar 18, 2023 2:59 am IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో ఒకో సినిమాకి గాను ప్రభాస్ ఒకో ఇంట్రెస్టింగ్ లుక్ లో అయితే తాను రెడీ అయ్యాడు. మరి ఈ చిత్రాల్లో రామాయణం ఆధారంగా తెరకెక్కించిన భారీ సినిమా “ఆదిపురుష్” కోసం కూడా ప్రభాస్ కొత్త లుక్ ని ప్రిపేర్ చేసాడు. అయితే దీనిని చాలా గోప్యంగా ఉంచిన మేకర్స్ ఫైనల్ గా ఫస్ట్ లుక్ మరియు టీజర్ లతో రివీల్ చేశారు.

మరి ఈ సినిమా విషయంలో ప్రభాస్ ప్రిపేర్ చేసిన ఈ లుక్ కి సంబంధించి కొన్ని ఆఫ్ లైన్ ఫోటోలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు అయితే ప్రభాస్ మరో మరోసారి అదే ప్రయత్నం జరిగింది. అయితే ఈసారి ప్రభాస్ పై పలు మార్ఫింగ్ ఫోటోలు విరివిగా బాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యాయి. అయితే కొందరు అటు నుంచి ప్రభాస్ ఫాలోవర్స్ అని చెప్పుకునే వారు కొన్ని హై రీచ్ ఉన్న పేజీ లు కూడా ప్రభాస్ పై ఈ పోస్ట్ లు షేర్ చేయడం బాధాకరం.

దీనితో ఇవి ఫేక్ అని తెలిసినప్పటికీ నిజమైన వాటిలా ప్రచారం చేయడం చూస్తుంటే పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనితో బి టౌన్ లో ప్రభాస్ ఇమేజ్ ని డామేజ్ చేసే విధంగా చేస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి వీటిలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :