పవన్ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ ను సిద్ధం చేస్తున్న అనిరుద్ !

8th, December 2017 - 02:02:11 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం షూటింగ్ ముగించుకుని ఆఖరి దశ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. జనవరి 10న విడుదలకానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. అలాగే ఆడియో నుండి ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ‘బయటికొచ్చి చూస్తే’ కు మంచి స్పందన రాగా మరొక పాట ‘గాలి వాలుగా’ డిసెంబర్ 12న విడుదలకానుంది.

ఈ పాటతో పాటు ఒక సప్రైజ్ ను ప్లాన్ చేశాడు సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్. ఆ సప్రైజ్ ఏమిటా అనుకుంటున్నారా.. అదే ప్రమోషనల్ సాంగ్. ఈ సాంగ్ కోసం ప్రత్యేకమైన సెట్ ను రూపొందిస్తున్నారు. అనిరుద్ దగ్గరుండి ఆ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.