
అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ జంటగా చిన్ని కృష్ణ దర్శకత్వం అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన చిత్రం ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’. నరేష్ ట్విన్ సిస్టర్ గా కార్తీక నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీకి ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ అమాయకుడి పాత్రలో నటించగా, బొమ్మాళి తరహా పాత్రలో కార్తీక నటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను నిరుత్సాహపరచదని అల్లరి నరేష్ ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 7న ఈ సినిమా విడుదలవుతుంది.
ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. స్టార్ హీరోల సినిమాలలో క్రూరమైన ప్రతి నాయకులుగా(విలన్స్) నటిస్తున్న కెల్లీ దోర్జీ (బద్రీనాథ్, బాద్ షా, 1 నేనొక్కడినే ఫేం) మరియు అభిమన్యు సింగ్ (రక్త చరిత్ర, గబ్బర్ సింగ్ ఫేం)లు కామెడీ చేయనున్నారు. వీరిద్దరిపై కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సీక్వెన్స్ లను చిత్రీకరించారట. కామెడీ సన్నివేశాలలో వారి నటన ప్రేక్షకులకు కొత్త కిక్ ఇస్తుందని హీరో నరేష్ చెప్పారు.