కే విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.!

Published on Feb 3, 2023 11:00 am IST

టాలీవుడ్ దిగ్గజ దర్శకులు మరియు నటులు అయినటువంటి తెలుగు సినిమా ముద్దు బిడ్డ శ్రీ కళా తపస్వి కే విశ్వనాథ్ గారు గత కొన్ని గంటల కితమే శివైక్యం అయ్యిన విషాద వార్త బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. వారి అకాల మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా సహా భారతదేశ సినిమా తీవ్ర విషాదాన్ని నింపుకుంది. అనేకమంది సినీ నటులు ఆయన తరం నేటి యువ తర నటులు కూడా తన వర్క్ కి మంత్రముగ్ధులు కావడం వారి మరణం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా విశ్వనాథ్ గారి మరణం పట్ల స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ తెలుగులో పెట్టారు. “శ్రీ కె. విశ్వనాథ్ గారి మృతిపట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను. అతను సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.” అంటూ మోడీ విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.

సంబంధిత సమాచారం :