తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రధాని మోదీ ప్రశంసలు..!

Published on Feb 5, 2022 10:21 pm IST

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని… తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని కొనియాడారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని, తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని వ్యాఖ్యానించారు. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణమని, పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయని అన్నారు.

సంబంధిత సమాచారం :