పండు గాడి దెబ్బకి మళ్లీ దిమ్మదిరిగిన బాక్సాఫీస్..స్పెషల్ షో వసూళ్ళ డీటెయిల్స్.!

Published on Aug 10, 2022 3:03 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ “పోకిరి” కూడా ఒకటి. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం సృష్టించింది. మరి ఇదిలా ఉండగా ఈ ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా అప్పటి పోకిరి ప్రింట్ ని మళ్లీ రీమాస్టార్ చేసి నెవర్ బిఫోర్ లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చెయ్యగా దీనికి భారీ రెస్పాన్స్ తో పాటుగా ఇప్పుడు మళ్లీ పండు గాడి దెబ్బకి బాక్సాఫీస్ షేక్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈ సినిమా ఉత్తరాంధ్ర లో స్పెషల్ షో వెయ్యగా దానికి 24 లక్షల 89 వేల 638 రూపాయల గ్రాస్ వసూలు కాగా నెక్స్ట్ గుంటూరు జిల్లాలో మొత్తం 33 షో లు ప్లాన్ చెయ్యగా దీనికి 13 లక్షల 2 వేల 265 రూపాయలు వసూలు అయ్యింది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం 30 షోలు ప్లాన్ చెయ్యగా అక్కడ 10 లక్షల 25 వేల 251 రూపాయలు గ్రాస్ వసూలు చేసి మళ్లీ ఒక నెవర్ బిఫోర్ రికార్డ్ ని ఈ చిత్రం నెలకొల్పింది. మొత్తానికి అయితే మాత్రం మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర తన ఇండస్ట్రీ హిట్ ఈ రేంజ్ వసూళ్లు నమోదు చేయడం మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

సంబంధిత సమాచారం :