నటి జీవిత పై పోలీస్ కేసు నమోదు
Published on Sep 28, 2016 12:30 pm IST

Jeevitha-12
ఒకప్పటి నటి, నటుడు రాజశేఖర్ భార్య జీవితపై పోలీస్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న ఈమె పై హైదరాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ కొండా అనే వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే జీవిత ఓ టీవీ కార్యక్రమం నిర్వహిస్తూ గొడవల కారణంగా విడిపోయిన కుటుంబాలను, వ్యక్తులను ఒక దగ్గరకు చేర్చి వారి మధ్య సయోధ్య కుదిర్చి కలపడం అనే కార్యక్రమం చేపట్టారు.

అయితే హైదరాబాద్ కు చెందిన కొండా అనే ఆటో డ్రైవర్ నటి జీవిత, ఆమె ఇద్దరు పిఏ లు తనను కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఫోన్లు చేసి ఇబ్బందిపెడుతున్నారని, బలవంతం చేస్తున్నారని కేసు పెట్టాడు. దీంతో పోలీసులు వారిపై 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు మేరకు కేసు పెట్టిన వ్యక్తి కొండా కొన్నేళ్ల క్రితం తన మొదటి భార్య జ్యోతి నుండి విడిపోయి రెండవ వివాహం చేసుకున్నాడు. దీంతో జ్యోతి జీవిత నిర్వహిస్తున్న కార్యక్రమం నిర్వాహకుల్ని కలిసి విషయం తెలిపింది. దాంతో వారు కొండాను ప్రోగ్రామ్ లో పాల్గొనాలని అడిగారు. కొండా ఒకసారి వెళ్లి వాళ్లను కలవగా అప్పుడు వారు మేడమ్ లేరని చెప్పి పంపి, తరువాత రోజు నుండి ప్రోగ్రామ్ కు రావాలని బలవంతపెడుతున్నారని బాధితుడు తెలిపినట్టు తెలుస్తోంది.

 
Like us on Facebook