ప్రముఖ నిర్మాత పై కేసు పెట్టిన ఓ లేడీ డాక్టర్

C-kalyan1
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చామబ్ర్ ఆఫ్ కామర్స్ మెంబర్ మరియు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పై ఈ రోజు ఉదయం హైదరాబాద్ జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు వేసారు. తన పక్క పార్ట్ మెంట్ లో ఉండే లేడీ డా.కవిత సి.కళ్యాణ్ పై కేసు పెట్టింది. ఆమె సి. కళ్యాణ్ తనని మాన్ హ్యాండ్లింగ్ చేసారని, చెడు భాషా ప్రయోగం చేసాడని, అలాగే తనకి కళ్యాణ్ వల్ల ప్రమాదం పొంచి ఉందని కేసు పెట్టింది. అసలు ఈ గొడవకి, ఈ సమస్యకి కారణం హైదరాబాద్ లో జరుగుతున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్. అదేంటి మెట్రో రైల్ కి ఈ గొడవకి సంబంధం ఏమిటనుకుంటున్నారా.? అందుకే అసలు విషయం లోకి వెళ్దాం..

సి. కళ్యాణ్ – డా. కవిత జూబ్లీ హిల్స్ రోడ్ నెం 5లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం సి. కళ్యాణ్ కి లాట్ చేసిన పార్కింగ్ ప్లేస్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానికి తగ్గా అమౌంట్ ని కూడా పే చేసింది. ఇక్కడ సమస్య ఏమిటంటే అదే పార్ట్ మెంట్ లో 3 ఫ్లాస్ట్ ఉన్న డా. కవిత యొక్క పార్కింగ్ ప్లేస్ తనకి ఇవ్వాలని సి. కళ్యాణ్ గొడవ పెట్టుకున్నాడు. ఆమె పార్కింగ్ ప్లేస్ తనకి ఇచ్చేయమని ఇబ్బంది పెడుతుండడంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆ టైం కి కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం వలన పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు.

Exit mobile version