‘పోలీస్ కంప్లైంట్’ విడుదల తేదీ ఖరారు.. కృష్ణ సాంగ్‌పై ఆదిశేషగిరిరావు ప్రశంసలు

Police Complaint Telugu Movie

నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బృందం విడుదల చేసింది. కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ఈ పాటను వీక్షించిన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను అభినందించారు.

‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్‌ ఆధారంగా హారర్, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. కృష్ణపై రూపొందించిన ప్రత్యేక పాటను ఆదిశేషగిరిరావు ప్రశంసించడం సంతోషంగా ఉందని హీరో కృష్ణసాయి పేర్కొన్నారు.

ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు.

Exit mobile version