పునీత్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు!

Published on Nov 7, 2021 11:14 pm IST

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి తో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి అతని మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే పునీత్ కి వైద్యం అందించిన వైద్యులు నిర్లక్ష్యం వహించారు అంటూ బెంగళూరు లోని సదా శివనగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

అయితే పునీత్ కుటుంబ వైద్యుడు రమణ రావు ను తక్షణమే అరెస్ట్ చేయాలి అంటూ ఫిర్యాదు లో పేర్కొనడం జరిగింది. ఈ వ్యవహారం తో డాక్టర్ రమణ రావు నివసించే ఇంటి వద్ద మరియు అతని క్లినిక్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

పునీత్ రాజ్ కుమార్ కి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, అంతేకాక తమ క్లినిక్ కి వచ్చిన సమయంలో ప్రాథమిక చికిత్స చేసినట్లు డాక్టర్ రమణ రావు తెలపడం జరిగింది. అయితే చికిత్స కోసం విక్రమ్ ఆసుపత్రికి వెళ్ళాలి అని సూచించారు. అక్కడ వైద్యులు పునీత్ ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. గత నెల 29 వ తేదీన జిమ్ చేస్తూ గుండెపోటు కి గురైన పునీత్, విక్రమ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సంబంధిత సమాచారం :