సాయితేజ్ బైక్ ప్రమాదంపై పోలీసులు లేటెస్ట్‌గా ఏం చెప్పారంటే..!

Published on Sep 12, 2021 12:22 am IST


మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్ ప్రమాదంపై పోలీసులు తాజాగా మరిన్ని విషయాలను వెల్లడించారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సాయి ధరమ్‌ తేజ్‌ నిన్న నడిపిన బైక్‌ను ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేశాడని, బైక్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదని, అనిల్ కుమార్‌ను పిలిచి విచారిస్తున్నామని అన్నారు. బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని, గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్‌ వద్ద ఓవర్‌ స్పీడ్‌ వెళ్లినందుకుగాను ఈ బైక్‌పై రూ.1,135 చలాన్ నమోదయ్యిందని, ఆ చలాన్‌ను నేడు సాయి ధరమ్‌ తేజ్‌ అభిమాని క్లియర్‌ చేశారని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే సాయి తేజ్‌కి రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌ 78 కి.మీ. వేగంతో ఉందని, అలాగే ప్రమాదానికి ముందు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై 102 కి.మీ. వేగంతో ఉందని పోలీసులు వెల్లడించారు. రాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. సాయి తేజ్ వద్ద టూవీలర్‌ నడిపే డ్రైవింగ్‌ లైసెన్స్‌ లభ్యం కాలేదని, కేవలం లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉందని డీసీపీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :