పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోతుంది. నిన్న జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుక ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా వాయిదాపడడంతో, రేపు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కొన్ని ఆంక్షలను విధించారు. అవేంటో తెలుసుకోండి.
పోలీసులు విధించిన ఆంక్షలు ఇవే:
* పాసులు లేకుండా గ్రౌండ్ దగ్గరకు వచ్చి గుమిగూడటానికి అనుమతి లేదు.
* గొడవలు, అల్లర్లకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
* ఫిబ్రవరి 21వ తేదీతో జారీచేసిన పాసులు చెల్లవు, కొత్త పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి.
* జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు కమలాపురి కాలనీ రోడ్డును ఎంచుకోవాలి.
* అమీర్‌పేట్ నుంచి యూసఫ్ గూడా మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గణపతి కాంప్లెక్స్ మీదుగా కమలాపురి కాలనీ, ఇందిరా నగర్ మీదుగా వెళ్లాలి.
* ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చే వారు తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్క్ చేయాలని, రోడ్ల మీద పార్క్ చేస్తే వాహనాలను సీజ్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
* సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడయం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
* పార్కింగ్ సమస్యతో ఇబ్బందిపడకుండా ఉండాలంటే వ్యక్తిగత వాహనాలలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకోవడం ఉత్తమమని సూచించారు.