పోల్ : ఈ మూడింటిలో ఏ చిత్రం వెనక్కి వెళితే బాగుంటుంది ?

ఈ వారాంతానికి ఆగష్టు 15 కలిసిరావడంతో వరుస సెలవులు వచ్చాయి. ఇలాంటి సమయం విడుదలకు మంచిది కావడంతో ‘లై, జయ జానకి నాయక, నేనేనే రాజు నేనే మంత్రి’ వంటి మూడు సినిమాలు ఆగష్టు 11వ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ విషయం ప్రేక్షకులకు మంచిదే అయినా సినిమాలకు మాత్రం ఇబ్బంది కలిగించే విషయం. వీటిలో ఏ ఒక్క సినిమా అయినా కొంచెం బాగోలేకపోయినా ప్రేక్షకులు నిర్ధాక్షిణ్యంగా రిజెక్ట్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఏదో ఒకటి వెనక్కి వెళితే ఓపెనింగ్స్, రిలీజ్ టాక్, వసూళ్ల పరంగా అన్నిటికీ మంచి జరుగుతుంది. కాబట్టి మీ ఉద్దేశ్యం ప్రకారం ఏ సినిమా వెనక్కి వెళితే బాగుంటుందో ఓటింగ్ ద్వారా తెలపండి.