లేటెస్ట్ : ‘పొన్నియన్ సెల్వన్’ డే 3 ఏపీ, తెలంగాణ కలెక్షన్స్

Published on Oct 3, 2022 5:30 pm IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన గ్రాండియర్ విజువల్ వండర్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1. ప్రఖాత్య సంస్థలు మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అయిన ఈ మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, ప్రకాష్ రాజ్, త్రిష తదితరులు కీలక పాత్రలు చేయగా ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ అందించారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ మూవీ యుఎస్ఏ సహా పలు ప్రాంతాల్లో ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

మొదటి రెండు రోజులు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో బాగానే కలెక్ట్ చేసిన ఈ మూవీ యొక్క 3వ రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే, ఇటు ఆంధ్రప్రదేశ్ లో రూ. 1.80 కోట్లు, అలానే అటు తెలంగాణాలో 1.70 కోట్ల నెట్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ. నిజానికి తమిళ్ తో పోలిస్తే తెలుగులో ఈ సినిమా మరింతగా రాబట్టాల్సి ఉందని, ఇవాళ్టి నుండి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కొల్లగొడుతుందో చూడాలని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

సంబంధిత సమాచారం :