‘పొన్నియన్ సెల్వన్’ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్, టైం లాక్

‘పొన్నియన్ సెల్వన్’ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్, టైం లాక్

Published on Aug 17, 2022 8:00 PM IST

ప్రస్తుతం భారీ స్థాయిలో క్రేజ్ కలిగిన పాన్ ఇండియా మూవీస్ లో మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ కూడా ఒకటి. చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ ఇలా అనేకమంది ప్రముఖ నటీనటులు కీలక రోల్స్ చేస్తున్న ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, ఒక సాంగ్ తో అందరిలో మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అయితే ఈ మూవీ నుండి ఆగష్టు 19న సాయంత్రం 6 గంటలకు చోళ చోళ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మూవీ యూనిట్ అఫీషియల్ గా తెలిపింది. చియాన్ విక్రమ్ పోస్టర్ తోపాటు సాంగ్ రిలీజ్ డేట్, టైం ని అనౌన్స్ చేసారు. పలు భాషల్లో పలువురు ప్రముఖ గాయకులు ఎంతో అద్భుతంగా ఆలపించిన ఈ సాంగ్ ని తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా మనో, అనురాగ్ కులకర్ణి కలిసి ఆలపించారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు