గ్రాండ్ విజువల్స్ అద్దిరిపోయిన మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్” టీజర్!

గ్రాండ్ విజువల్స్ అద్దిరిపోయిన మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్” టీజర్!

Published on Jul 8, 2022 8:00 PM IST

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం పోన్నియిన్ సెల్వన్. ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం మొదటి పార్ట్ కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను విడుదల చేయడం జరిగింది. తెలుగు లో ఈ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయగా, తమిళ్ లో సూర్య, కన్నడ లో రక్షిత్ శెట్టి, హిందీ లు అమితాబ్ బచ్చన్ లు విడుదల చేయడం జరిగింది.

ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 10 వ శతాబ్దం లో చోళ సామ్రాజ్య నేపథ్యం లో ఈ వింజువల్ వండర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని భారీ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు ఆర్. శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం, ప్రకాష్ రాజ్, రెహమాన్, పార్తిబన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ విజువల్ వండర్ ను సెప్టెంబర్ 30, 2022 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు