‘పొన్నియన్ సెల్వన్ 2’ విడుదల పై మరో పుకారు !

‘పొన్నియన్ సెల్వన్ 2’ విడుదల పై మరో పుకారు !

Published on Nov 7, 2022 3:59 PM IST

విజువల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి కీలక పాత్రల్లో వచ్చిన పీరియాడిక్‌ డ్రామా ‘ పొన్నియిన్‌ సెల్వన్’. కాగా ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పార్ట్‌-1 తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.460 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. పైగా పార్ట్ 1 ఎండింగ్ లో పార్ట్ 2 కి ఇచ్చిన లీడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో.. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రిలీజ్ పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రెండో భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అంటూ మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది. అయితే, ఇదే డేట్ కు రావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా మెజార్టీ భాగం పూర్తయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు