మహేష్ సినిమాలో ‘పొన్నియిన్ సెల్వన్’ నటి ?

మహేష్ సినిమాలో ‘పొన్నియిన్ సెల్వన్’ నటి ?

Published on Oct 31, 2022 5:29 PM IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఐతే, ఈ సినిమాలో ఇప్పుడు ఓ కీలక పాత్రలో ‘పొన్నియిన్ సెల్వన్’ నటి నటించబోతుందని తెలుస్తోంది. మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మికి మహేష్ – త్రివిక్రమ్ సినిమా రూపంలో ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట.

పైగా ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి పాత్ర పూర్తిగా నెగిటివ్ గా ఉంటుందని.. ముఖ్యంగా ఐశ్వర్య లక్ష్మి – మహేష్ పాత్రల మధ్య డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఐశ్వర్య లక్ష్మి మంచి నటి. పాత్రకు అనుగుణంగా ఐశ్వర్య లక్ష్మి తన నటనను మార్చుకుంటూ ఆ పాత్రలో లీనం అయిపోతుంది. మరి మహేష్ సినిమాలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది అనేది చూడాలి.

ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు