నైజాంలో “పొన్నియిన్ సెల్వన్” డే 1 వసూళ్లు..!

Published on Oct 1, 2022 12:00 pm IST

కోలీవుడ్ నుంచి మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా వచ్చినటువంటి లేటెస్ట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్” కోసం అందరికీ తెలిసిందే. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా చేసినటువంటి ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించగా వాటిలో మొదటి భాగం నిన్న పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అయ్యింది. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బజ్ తోనే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి రోజు నైజాం లో అయితే మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి అక్కడ ఫస్ట్ డే 2.3 కోట్ల షేర్ వచ్చిందట. ఇది డీసెంట్ నెంబర్ అనే చెప్పాలి. అలాగే వీకెండ్ వసూళ్లు కూడా పెద్దగా వేరే సినిమాలు లేవు కాబట్టి బెటర్ అవ్వొచ్చని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి సహా త్రిష ఐశ్వర్య రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :