యంగ్ హీరో సినిమాకి ఓకే చెప్పిన పూజా హెగ్డే !


చాన్నాళ్ల తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే ఆ సినిమా సక్సెస్ తో టాప్ గేర్లో దూసుకుపోతోంది. స్టార్ హీరోల దగ్గర్నుంచి యంగ్ హీరోల సినిమాల వరకు ఆమెకు మంచి మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పూజా ఒక యంగ్ హీరో సినిమాకి ఓకే చెప్పిందట. ఆ హీరో ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్లో ఆయన చేయనున్న యాక్షన్ ఎంటర్టైనర్లో మొదటి నుండి స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో పూజా హెగ్డేను సంప్రదించారు. ఆఫర్ విని ఆలోచించడానికి కొద్దిగా ఎక్కువ సమయాన్నే తీసుకున్న పూజా ఎట్టకేలకు ఓకే చెప్పింది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. కెరీర్ ఆరంభం నుండి తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లే ఉండేలా చూసుకునే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయపాటి శ్రీనుతో చేస్తున్న ‘జయ జానకి నాయక’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ తో ఆడి పాడనున్నాడు.