బీస్ట్ చిత్రం షూటింగ్ ముగించేసిన పూజా హెగ్డే…విజయ్, నెల్సన్ దిలీప్ కుమార్ పై కీలక వ్యాఖ్యలు!

Published on Dec 10, 2021 12:34 pm IST

వరుణ్ డాక్టర్ చిత్రం సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కామెడి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. నేటి తో బీస్ట్ చిత్రం షూటింగ్ కి సంబంధించి తన పార్ట్ పూర్తి అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు పూజా హెగ్డే. ఈ మేరకు చిత్ర షూటింగ్, హీరో విజయ్, డైరెక్టర్ దిలీప్ కుమార్ ల పై పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బీస్ట్ చిత్రం కోసం పని చేసినందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను అని అన్నారు. ఈ సినిమా చూసేటప్పుడు మీరు చాలా నవ్వుతారు. సెట్స్ లో ఉన్నంత సేపు చాలా సంతోషంగా చేశాం అని అన్నారు. విజయ్ స్టైల్ మరియు నెల్సన్ దిలీప్ కుమార్ స్టైల్ ప్రతి ఒక్కరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది అని అన్నారు. సెట్స్ లో ఉండి చేయడం చాలా గ్రేట్ గా ఉంది అని, వెకేషన్ కి వెళ్లినట్లు గా షూటింగ్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. బాధాకరం ఏమిటంటే, ఈరోజు బీస్ట్ షూటింగ్ కి సంబంధించి నా పార్ట్ అయిపోతుంది అని అన్నారు. థియేటర్స్ లో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు పూజా హెగ్డే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :