డబుల్ హ్యాట్రిక్ విజయం పై పూజ హెగ్డే ధీమా… రాధే శ్యామ్ పై కూడా..!

Published on Oct 17, 2021 10:06 pm IST

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే రెండు రోజుల్లోనే ఈ చిత్రం 18 కోట్ల కి పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఆ పోస్టర్ ను షేర్ చేస్తూ పూజ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మీ స్వభావాన్ని నమ్మండి, మీ గట్ ఫీలింగ్ ను నమ్మండి, అది ఎల్లప్పుడూ మిమ్మల్ని సరైన మార్గం లో నడిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మరొక హిట్ తన ఖాతాలో చేరడం పై దేవుడు కి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నటీనటులకు మరియు టీమ్ అందరికీ కూడా కంగ్రాట్స్ తెలిపారు పూజ హెగ్డే. అయితే పూజ హెగ్డే చేసిన వ్యాఖ్యల పట్ల నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. తెలుగు లో డబుల్ హ్యాట్రిక్ అంటూ చెప్పుకొచ్చారు. అరవింద సమేత వీర రాఘవ రెడ్డి, మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠ పురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత రాధే శ్యామ్ అంటూ చెప్పుకొచ్చారు. పూజ హెగ్డే దీనికి స్పందిస్తూ, తెలుగు లో సినిమాలు విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, రాధే శ్యామ్ చాలా స్పెషల్ చిత్రం అని, ప్రేరణ పాత్ర లో చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :