మోస్ట్ ఎలిజిబుల్ నుండి తన ఫేవరేట్ ట్రాక్ అంటూ పూజా హెగ్డే కామెంట్స్!

Published on Sep 14, 2021 4:15 pm IST


అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఒక లిరికల్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. లేహెరాయి అంటూ సాగే ఈ పాట ను సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించారు.

అయితే ఇందుకు సంబంధించిన పూర్తి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రేపు విడుదల చేయనుంది. అయితే దీని పై నటి పూజా హెగ్డే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుండి ఈ పాట తన కి ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :