మెగాస్టార్ చిరంజీవి, యశ్ ల పై పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు!

Published on Oct 18, 2021 3:00 pm IST

సోషల్ మీడియాలో తరచూ యాక్టిివ్ గా ఉండే పూజా హెగ్డే నేడు అభిమానుల తో ఇంటరాక్ట్ అయ్యారు. సమయం ఉండటం తో అభిమానుల తో ఇంటరాక్ట్ కాగా, ఆస్క్ పూజా హెగ్డే పేరిట హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తూ అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు.

ఈ మేరకు పూజా హెగ్డే అందులో కొన్నిటికి సమాధానం ఇవ్వడం జరిగింది. అందులో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం గురించి అడగగా, అది పీరియాడిక్ లవ్ స్టోరీ, గొప్పగా, అద్భుత విజువల్స్ తో ఉండనుంది అని అన్నారు. ఒక్క ముక్క లో తలపథి విజయ్ స్వీటెస్ట్ అని అన్నారు. తన అభిమానులు చాలా ప్రొటెక్టివ్ అంటూ చెప్పుకొచ్చారు.

అందులో ఒక అభిమాని యశ్ గురించి ఒక్క ముక్కలో చెప్పండి అని అడగగా, కన్నడ సినీ పరిశ్రమ గర్వ పడే స్టార్ అంటూ తెలిపారు. ఆచార్య లో చిరు తో నటించడం ఎలా ఉంది అంటూ ఒక అభిమాని అడగగా, దాని గురించి తెలీదు కానీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం చూసి తన నటన మెచ్చుకున్నారు అని, ఇప్పుడు మరింత కష్టపడి పని చేయడానికి స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చారు. ఎవరితో నటించడం మీ డ్రీమ్ అంటూ ఒకరు అడగగా, ఒన్ అండ్ ఓన్లీ అమితాబ్ బచ్చన్ సర్ అని అన్నారు. ఏదో ఒక రోజు తన కల నెరవేరుతుంది అని అనుకుంటున్నా అని అన్నారు.

సంబంధిత సమాచారం :