“రాధే శ్యామ్” లో ప్రభాస్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు – పూజా హెగ్డే

Published on Mar 7, 2022 1:30 pm IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం ప్రమోషన్‌లో నిన్నటి నుండి వీరు బిజీగా ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది.

ప్రభాస్ యాక్షన్‌కు ఎక్కువ పేరుందని అయితే ఈ చిత్రం లో క్లైమాక్స్‌లో ఓ సన్నివేశం ఉందని, దానిని ప్రభాస్ తన నటనతో చంపేశాడని పూజా చెప్పింది. ప్రభాస్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, ప్రభాస్ అభిమానులు తమ అభిమాన నటుడు లోని కొత్త కోణాన్ని చూస్తారని పూజా చెప్పడం తో మరింత ఆసక్తి నెలకొంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన రాధే శ్యామ్ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :