ఎట్టకేలకు దువ్వాడ జగన్నాథానికి జోడీ కుదిరింది !

pooja-hegde-alluarjun
‘సరైనోడు’ సూపర్ హిట్ తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘డీజే – దువ్వాడ జగన్నాథం’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకుంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్న దానిపై ఇప్పటివరకు తీవ్రమైన చర్చ జరిగింది. మొదట పూజ హెగ్డేతో చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఆ ఆమె కాదని కాజల్ అగర్వాల్ ను ఫిక్స్ చేశారని బలమైన ఊహాగానాలు వినిపించాయి.

ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ బన్నీ సరసన పూజా హెగ్డే ఖాయమైనట్టు యూనిట్ సన్నిహిత వర్గాల నుండి వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే బాలీవుడ్ లో అంత మంచి ఫలితం రాబట్టుకోలేకపోయిన పూజా హెగ్డేకు తెలుగులో సక్సెస్ అవడానికి గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టే. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారమూ అందలేదు. ఇకపోతే దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా, ఆయాంకా బోస్ సినిమాటోగ్రఫీ అందిచనున్నారు.