“వరుడు కావలెను” సంగీత్ కి చీఫ్ గెస్ట్ గా పూజా హెగ్డే

Published on Oct 22, 2021 3:00 pm IST

నాగశౌర్య, రీతువర్మ హీరో హీరోయిన్ లుగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సూర్య దేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మి సౌజన్య ఈ చిత్రం తో దర్శకురాలి గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను రానా దగ్గుపాటి విడుదల చేయగా, విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం కి సంబంధించిన సంగీత్ కార్యక్రమం ను రేపు సాయంత్రం 6 గంటలకు ఐటిసి కోహినూర్ వద్ద నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి పూజా హెగ్డే రానున్నారు. ఈ చిత్రం ను ఈ నెల 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :