యాక్షన్ సన్నివేశాల్లో సాలిడ్ స్టంట్స్ చేయనున్న పూజా హెగ్డే!

Published on Jun 1, 2022 2:50 pm IST


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జన గణ మన. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం తో సినిమా కోసం చిత్ర యూనిట్ ఫుల్ ప్లానింగ్ తో యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తుంది. ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ వారం లో షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వార్తల ప్రకారం, ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా కొన్ని యాక్షన్ బ్లాక్‌లను చేస్తుంది. అదే కారణంతో, ఆమె విదేశీ కోచ్ వద్ద శిక్షణను ప్రారంభించింది. జన గణ మన చిత్రం అనేది దేశభక్తి అంశాలతో నిండిన యాక్షన్ డ్రామా. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :