నా కల నెరవేరింది.. బుట్టబొమ్మ ఎమోషనల్ పోస్ట్..!

Published on Jan 22, 2022 3:03 am IST


టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజాహెగ్ధే తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఈ బుట్టబొమ్మ ముంబైలో సొంత ఇంటిని నిర్మించుకుంది. నేడు కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన పూజాహెగ్ధే సంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

అయితే ఈ రోజు కోసం ఒక సంవత్సరం నుంచి వేచి చూస్తున్నానని, అన్ని కలలు నెరవేరాయని తెలిపింది. అయితే మిమ్మలని మీరు విశ్వసించి కష్టపడి పనిచేయాలని, అప్పుడు మీ హృదయంతో ఈ విశ్వమే ప్రేమలో పడుతుందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన పూజాహెగ్ధేకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

https://www.instagram.com/hegdepooja/p/CY_pwDXP1t8/?utm_medium=copy_link

సంబంధిత సమాచారం :