“ఎఫ్3” స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే…సెట్స్ లో డాన్స్ షురూ..!

Published on Apr 15, 2022 12:30 pm IST


విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం లో స్పెషల్ సాంగ్ ఉండనుంది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పాట కోసం పూజా హెగ్డే ను చిత్ర యూనిట్ సంప్రదించింది. అందుకు ఓకే అనడం తో తాజాగా సెట్స్ లో జాయిన్ అయ్యారు.

ఈ చిత్రం లో పూజా హెగ్డే స్పెషల్ కోసం భారీగా పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక మంచి స్టెప్పులతో ఈ పాట ఉండనుంది అని తెలుస్తోంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న పూజ ఎరుపు రంగు దుస్తుల్లో ఉంది. ఎఫ్‌3లో తమన్నా, మెహ్రీన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :