“ఆచార్య” నుంచి అద్భుతంగా నీలాంబరి లుక్.!

Published on Oct 13, 2021 5:20 pm IST


ఈరోజు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా మొత్తం ఇండియన్ వైడ్ ఇతర సెలెబ్రెటీలు తమ విషెష్ ని తెలియజేస్తున్నారు. అలాగే తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల నుంచి తనవి కొత్త పోస్టర్స్ కూడా బయటకి వస్తాయని నిన్న వార్తలు రాగా వాటిని నిజం చేస్తూ థన్ భారీ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్” నుంచి ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇది పక్కన పెడితే మెగా మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య” నుంచి కూడా ఒక పోస్టర్ కన్ఫర్మ్ కాగా దాని నుంచి కూడా ఇప్పుడు మేకర్స్ మంచి పోస్టర్ ని వదిలారు. దీనిలో పూజా మాత్రం చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్పాలి. చాలా ప్లెజెంట్ గా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కనిపించబోతుంది అని అర్ధం అవుతుంది. మొత్తానికి మాత్రం పూజా ఫ్యాన్స్ కి ఈ రెండు అప్డేట్స్ మంచి ఫీస్ట్ ఇచ్చాయని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :