ఐటెం సాంగులకు రెడీ – మెగా హీరోయిన్..!

pooja

పూజా హెడ్గే… అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా సినిమా ‘ఒక లైలా కోసం’లో హీరోయిన్. అలాగే మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది ఈ బెంగుళూరు ముద్దుగుమ్మ. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే హృతిక్ రోషన్ సరసన ‘మొహెంజో దారో’లో అవకాశం సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం పూజా హెడ్గే చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే.

ఐటెం సాంగ్స్ లో నటించడానికి నేను రెడీ అంటూ తాజాగా సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది పూజా. ఐటెం సాంగ్స్ చేయడంలో ఫన్ ఉంటుంది అంటూ సెలవిచ్చింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ లో నటించడం కామన్. హిందీ అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ మాటలు మాట్లాడుతుంది అనుకుంటే పొరపాటు. తెలుగులో ఆమె నటిస్తున్న రెండు సినిమాలు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ట్రెడిషనల్ క్యారెక్టర్స్ లో కనిపించనుంది. గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా నేను రెడీ అంటూ ఇలా స్టేట్మెంట్ ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version