SSMB28 కోసం రెడీ అయిన పూజా హెగ్డే…!

SSMB28 కోసం రెడీ అయిన పూజా హెగ్డే…!

Published on Aug 26, 2022 3:02 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో SSMB28 మూవీ గ్రాండ్ లెవెల్లో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ మూవీని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనుండగా భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీగా దర్శకుడు త్రివిక్రమ్ దీనిని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మది కెమెరా మ్యాన్ గా పని చేయనున్న ఈ మూవీలో అందాల నటి పూజా హెగ్డే సూపర్ స్టార్ కి జోడీగా నటించనున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ తో ఆమె మహర్షి మూవీ చేసారు.

వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి పెద్ద హిట్ కొట్టింది. ఇప్పటికే ఈ ఏడాది బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య మూవీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా, కొద్దిరోజుల క్రితం విదేశాలకు హాలిడే ఎంజాయ్ చేయడం కోసం వెళ్లారు. ఇటీవలే ఇండియాకి తిర్గివచ్చి ప్రతిష్టాత్మక SSMB28 మూవీ కోసం ఆమె అన్నివిధాల సిద్ధం అయినట్లు చెప్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే క్యారెక్టర్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉందని, తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ పెద్ద సక్సెస్ అందుకుంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు