ఈ ముగ్గురు బిగ్ స్టార్స్ తో యాక్ట్ చెయ్యాలనుంది – పూజా హెగ్డే

Published on Mar 5, 2022 1:01 pm IST

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో లక్కీ చార్మ్ గా నిలిచిన అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒకరు. అయితే ఇప్పుడు పూజా హెగ్డే పలు భారీ ఆఫర్స్ తో బిజీగా ఉండడమే కాకుండా వరుసగా పలువురు పెద్ద హీరోస్ సినిమాలలో అవకాశాలు దక్కించుకొంటుంది.

మరి లేటెస్ట్ గా అయితే పూజా హెగ్డే ఇంకా ఏ బిగ్ స్టార్స్ తో వర్క్ చెయ్యాలి అనుకుంటుంటుందో ఒక ముగ్గురు టాప్ హీరోల పేర్లు చెప్పడం ఆసక్తిగా మారింది. మరి ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాగా ఇంకో ఇద్దరు స్టార్ నటులు కోలీవుడ్ కి చెందిన విశ్వ నటుడు కమల్ హాసన్ మరియు ధనుష్ లతో అట.

ఈ ముగ్గురు బిగ్ స్టార్స్ తో తాను నటించాలని కోరుకుంటున్నట్టు ఈ స్టార్ హీరోయిన్ తెలిపింది. మరి ఎప్పుడు వీరితో వర్క్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఈమె ప్రభాస్ తో నటించిన భారీ సినిమా “రాధే శ్యామ్” చిత్రం మార్చ్ 11న రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :