‘రాధేశ్యామ్’ డబ్బింగ్ ముగించేసిన బుట్టబొమ్మ..!

Published on Dec 4, 2021 12:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” సినిమా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ల జోరును కూడా గట్టిగానే చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో “ప్రేరణ” పాత్రలో నటిస్తున్న పూజాహెగ్ధే తాజాగా తన డబ్బింగ్‌ని పూర్తి చేసేసింది. టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :