మాస్ బీట్ తో అదరగొట్టిన “పూనకాలు లోడింగ్”

మాస్ బీట్ తో అదరగొట్టిన “పూనకాలు లోడింగ్”

Published on Dec 30, 2022 6:37 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ కి ఈ చిత్రం దగ్గర పడుతుండటం తో సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా షురూ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుండి పూనకాలు లోడింగ్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా మాస్ పాట పూనకాలూ లోడింగ్‌ను టీమ్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన కొద్ది సేపటికే సాంగ్ వైరల్ గా మారింది. ఈ సాంగ్ మాస్ లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మెగాస్టార్ మరియు మాస్ మహారాజా ఈ ర్యాప్‌కు రోల్ రైడా మరియు రామ్ మిర్యాలతో కలిసి తమ గాత్రాన్ని అందించారు.

ఈ చిత్రం లో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ బీట్స్ సూపర్ గా ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకలలో ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలవనుంది. రోల్ రైడా రాసిన ఈ పాటలో చిరు, రవితేజ డ్యాన్స్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు