సైరా ని అక్కడ వార్ దెబ్బేసింది

syee raa war

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా నిర్మించిన సైరా నిన్న విడుదలై అద్భుత స్పందన దక్కించుకుంది. అటు సాధారణ ప్రేక్షకుల నుండి ఇటు ఫిలిం క్రిటిక్స్ వరకు సైరా చిత్రం పై, చిరు నటనపై మరియు దర్శకుడు సురేంధర్ రెడ్డి టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే ఇదంతా కేవలం సౌత్ కే పరిమితం. నార్త్ ఇండియాలో సైరా పరిస్థితి దారుణంగా ఉందని మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే అర్థం అవుతుంది. సైరా హిందీ వర్షన్ మొదటి రోజు కేవలం 2కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందంటేనే తెలుస్తుంది అక్కడ సైరా పరిస్థితి ఏమిటనేది.

ఐతే బాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన వార్ చిత్ర విడుదల కూడా సైరా ఈ పరిస్థితి కారణం అని చెప్పొచ్చు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోల చిత్రం కావడంతో పాటు, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా సైరా కు చాలా తక్కువ కేటాయించడం జరిగింది. ఇక వార్ మూవీ దాదాపు 50కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ దిశగా నడుస్తుంది. హాలీవుడ్ మూవీ జోకర్(6కోట్లు) చిత్రం కంటే కూడా సైరా వసూళ్లు తక్కువ కావడం గమనార్హం. సైరా హిందీ వర్షన్ కనీసం వారాంతపు సెలవలు దినాలలోనైనా పుంజుకుంటుందేమో చూడాలి.

Exit mobile version